కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. అధికార పార్టీని గెలిపిస్తే పన్నుల భారం పెంచుతూ పోతుందని చెప్పినా ప్రజలు వినలేదని.. ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వైకాపా తుంగలోకి తొక్కిందని కేశినేని నాని దయ్యబట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు నాని, డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కరోనా కష్టకాలంలో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్ధితిలో లేదని.. పెరుగుతున్న పన్నులు, నిత్యావసర ధరలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ప్రజలు కష్టాకాలంలో ఉంటే మేమున్నామంటూ భరోసా కల్పించేదే తెలుగుదేశం పార్టీ అని కేశినేని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..