ETV Bharat / city

కొడుకు మృతిపై తల్లి ఫిర్యాదు.. రంగంలోకి పోలీసులు - విజయవాడ తాజా వార్తలు

విజయవాడ అజిత్​సింగ్​కు చెందిన కృష్ణ కుమారి అనే మహిళ.. తన కుమారుడు అనుమానాస్పదంగా చనిపోయాడంటూ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు స్పందించారు. జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు గన్నవరం మండలం దావాజిగూడెంలో కృష్ణకుమారి కుమారుడు మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరించారు.

కొడుకు మృతిపై తల్లి ఫిర్యాదు.. పోలీసులు ఆధారాలు సేకరణ

author img

By

Published : May 28, 2020, 11:51 AM IST

ఈనెల 22న తన కుమారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడని విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన కృష్ణకుమారి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. గన్నవరం మండలం దావాజీగూడెంలో గుడివాడ కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరించారు.

కోటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అతని మృతదేహంపై గాయాలు గుర్తించినట్లు తల్లి కృష్ణకుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాల గురించి కోడల్ని ప్రశ్నించిగా.. గుండెనొప్పితో బాత్​రూంలో పడి చనిపోయాడని సమాధానం ఇచ్చింది. కొడుకు మరణం తర్వాత కోడలు, ఆమె బంధువులు చెబుతున్న సమాధానాలు పొంతన లేకపోవటంపై అనుమానం వచ్చిన కృష్ణకుమారి.. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా గురువారం కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరించారు.

సంబంధిత కథనం:

కొడుకు మృతి... కోడలుపై అనుమానం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.