ETV Bharat / city

Dharani Portal Modules: ధరణి​లోని సమస్యల పరిష్కారానికి మరిన్ని మాడ్యుల్స్ - Dharani Portal Modules 2021

తెలంగాణలో ధరణి పోర్టల్‌(Dharani Portal)లోని సమస్యల పరిష్కారానికి మరికొన్ని మాడ్యూల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములను సుమోటోగా తొలగించాలని.. ఇప్పటికే కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వివిధ కారణాలతో ప్రభుత్వం వద్ద ఉండిపోయిన నగదును యజమానులకు తిరిగి చెల్లించడంపైనా సర్కారు దృష్టి సారించింది.

ధరణి​లోని సమస్యల పరిష్కారానికి మరిన్ని మాడ్యుల్స్

author img

By

Published : Nov 27, 2021, 11:54 AM IST

ధరణి​లోని సమస్యల పరిష్కారానికి మరిన్ని మాడ్యుల్స్

Dharani Portal Modules: తెలంగాణలో ధరణి పోర్టల్‌లో వస్తున్న సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. పోర్టల్ లావాదేవీల్లో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కొన్ని మాడ్యూల్స్‌ (Dharani Portal Modules) అందుబాటులోకి తెచ్చారు. అయినా ఇంకా కొన్ని సమస్యలు రైతులకు ఇబ్బందిగా మారాయి. ప్రధానంగా పేర్ల ముద్రణలో తప్పిదాలు, సర్వే విభాగాల్లో పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, తప్పుగా నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లడం వంటి సమస్యలున్నాయి.

మాడ్యుల్స్​పై అవగాహన...

వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Financial Harish Rao)నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం.. కొన్నాళ్లుగా అధికారులతో చర్చిస్తోంది. పలు దఫాలుగా సమావేశమై... సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే ఉన్న మాడ్యూల్స్‌పై అవగాహన కల్పించడం సహా మరికొన్నింటిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా మరో 5, ఆరు మాడ్యూల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు.

ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయి. తదుపరి భేటీలో వాటిని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచనున్నారు. ఆ మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుత సమస్యల్లో 75 నుంచి 80 శాతం వరకు పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మిగిలే కొద్దిపాటి సమస్యలకు త్వరగానే పరిష్కారాలు చూడవచ్చని చెబుతున్నారు. తద్వారా భూలావాదేవీలకు చెందిన సమస్యలు దాదాపుగా సమసిపోతాయని భావిస్తున్నారు.

కలెక్టర్లకు ఆదేశం...

నిషేధిత భూముల జాబితాలో పొరపాటున చేరిన వాటిని వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విజ్ఞప్తులు, ఫిర్యాదుల కోసం చూడకుండా... కలెక్టర్లు సుమోటోగా తీసుకొని వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలావరకు ఆ తరహా భూముల సమస్య పరిష్కారంమైందని... ఒకటి, రెండ్రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో భూలావాదేవీలకు సంబంధించి రైతులు చెల్లించిన నగదు వివిధ కారణాలతో ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది.

ఆ మొత్తం రైతులకు తిరిగిరావాల్సి ఉంది. తమ నగదు తిరిగి చెల్లించాలని రైతులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. ఆ మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. రెండు, మూడ్రోజుల్లో మరోసారి సమావేశం కానున్న మంత్రివర్గ ఉపసంఘం కొత్త మాడ్యూల్స్‌(Dharani Portal Modules)ను పరిశీలించి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

ఇవీచూడండి:

కట్నం డబ్బులు.. గర్ల్స్ హాస్టల్​ నిర్మాణానికి విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.