ETV Bharat / city

Jubilee hills case: అత్యాచారం చేసిన తరువాత.. కారెక్కి అక్కడికి వెళ్లారు! - Gang Rape on Girl at jubileehills

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో జరిగిన బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. అత్యాచారం అనంతరం కారులో మొయినాబాద్​కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్​లో ఆశ్రయం పొందారని సమాచారం.

అత్యాచారం చేసిన తరువాత నిందితులు ఎటు వెళ్లారంటే...

author img

By

Published : Jun 5, 2022, 4:31 PM IST

Jubilee hills gang rape case: హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో జరిగిన బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. అత్యాచారం అనంతరం కారులో మొయినాబాద్​కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్​లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఆ ఫాంహౌస్​ నుంచే నిందితులు వేర్వేరు చోట్లకు పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫాంహౌస్​ వెనక కారును దాచిన నిందితులు.. అక్కడే కారుకు ఉన్న ప్రభుత్వ వాహన స్టిక్కర్​ను తొలగించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫాంహౌస్​ యజమాని అయిన రాజకీయ నేతను పోలీసులు ఆరా తీస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
Gang Rape on Girl: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది.

అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ప్రముఖుల కుమారులు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక.. వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఆ తర్వాత బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తొలుత భావించిన పోలీసులు.. అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పడంతో సెక్షన్లు మార్చి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.