కరీమున్నీసా మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి.. వైకాపా అభ్యర్థిని ఖరారు చేసింది. కరీమున్నీసా కుమారుడు మహమ్మద్ రుహుల్లాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన మహ్మద్ రుహుల్లాకు సీఎం జగన్ బీ ఫాం అందజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా రుహుల్లా కుటుంబసభ్యులు ఉన్నారు.
రేపు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయనున్నట్లు మహమ్మద్ రుహుల్లా తెలిపారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గుండెపోటుతో మృతి..
కరీమున్నీసా మొదట వైకాపా కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతరం ఆమె సేవలను గుర్తించిన సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గతేడాది నవంబర్ 19న ఆమె గుండెపోటుతో మృతి చెందారు. కరీమున్నీసా మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆమె కుమారుడి పేరును వైకాపా సూచించింది.
ఇదీ చదవండి
MLC Kareemunnisa passed away : ఎమ్మెల్సీ కరీమున్నీసా భౌతిక కాయానికి.. సీఎం జగన్ నివాళి