రాయలసీమ ప్రాజెక్టులపై వైఖరి ఏమిటో చంద్రబాబు(chandrababu) చెప్పాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ సహా చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులను సీఎం జగన్(cm jagan) సాధిస్తారని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీటిని తీసుకురావడం సహా ప్రాజెక్టులను తప్పక పూర్తిచేస్తారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. ఇళ్లు కట్టుకోకపోతే ఇళ్ల స్థలాలు లాక్కుంటారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పట్టాలు వచ్చిన వారందరికీ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటారన్నారు. చంద్రబాబు దీక్ష చేసింది 3 గంటలైతే ప్రభుత్వాన్ని 4 గంటల పాటు తిట్టారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలు ఓర్వలేక చంద్రబాబు మాట్లాడారన్నారు. కొవిడ్(covid) నియంత్రణలో సీఎం జగన్ సమర్థంగా వ్యవహరించారని డొక్కా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా