తెదేపా నేతలు పార్టీ మారడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీకి ఎంపీగా, ఎమ్మెల్యేగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వంశీకి పార్టీలో ఏం అగౌరవం జరిగిందో గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినాష్‌కు తెలుగు యువత అధ్యక్షుడిగా పదవి ఇచ్చి... ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే, లోకేష్ మీద అవాకులు... చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'జగన్‌కు సైనికుడిగా ఉండాలనే వైకాపాలోకి వచ్చా'