తెదేపాను వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నారని ఎమ్మెల్సీఅశోక్ బాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా పాలన చేయాలనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు. రెండు రోజులు మాత్రమే బడ్జెట్ సమావేశాలు జరిపినప్పుడు.. బిల్లులు ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమెుచ్చిందని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి బడ్జెట్ ప్రాధాన్యమో.. లేక రాజధాని బిల్లులు ముఖ్యమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్న ఆయన..151 సీట్లు వైకాపా పాలనకు కొలమానం కాదన్నారు.