![తెదేపా ఫిర్యాదు కాపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12754616_ashokeee.png)
రాష్ట్రంలో సీఐడీ అధికారుల తీరుపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర, విద్వేషపూరిత పోస్టులు పెడుతున్న వైకాపా మద్దతుదారులపై తెదేపా నేతలు సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అయినా... సీఐడీ పట్టించుకోవడంలేదని అశోక్ బాబు మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల అసభ్యకర పోస్టులపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏడీజీకి అశోక్ బాబు ఫిర్యాదు చేశారు. గతంలో చేసిన ఫిర్యాదులపై.. అధికారులు కేసులు నమోదు చేసినా నిందితులను అరెస్టు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తెదేపా మద్దతుదారులపై వైకాపా దాఖలు చేసిన తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం వేగంగా స్పందిస్తున్నారని దుయ్యబట్టారు.
సమాజంలో కించపరిచేలా పోస్టులు
తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను కించపరచడం, వారి పరువుకు భంగం కలిగించడం వంటి దురుద్దేశాలతో వైకాపా కార్యకర్తల పోస్టులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషం ప్రోత్సహించేలా ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు, పుకార్లు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వీటి కోసం వైకాపా మద్దతుదారులు అనేక సోషల్ మీడియాలను ఉపయోగిస్తున్నారన్నారు.
పోలీసుల ఏకపక్ష చర్యలు మంచిది కాదు..
తెదేపా మద్దతుదారులపై మాత్రమే చర్యలు తీసుకోవడంలో పోలీసుల పక్షపాత ధోరణి స్పష్టంగా తెలుస్తుందన్నారు. పోలీసుల ఇలాంటి ఏకపక్ష చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Fake Ticket: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. విజిలెన్స్ దర్యాప్తు