రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఐఏఎస్‌ల సంఘం స్పందించాలని ఎమ్మెల్సీ అశోక్బాబు డిమాండ్ చేశారు. క్రిందిస్థాయి ఉద్యోగులపై అధికారులు వేధింపులు ఆపాలన్నారు. ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై మాట్లాడాలని అశోక్బాబు కోరారు. ఐఏఎస్లు తమ బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వం తీసుకునే చట్ట విరుద్ధ నిర్ణయాలను వ్యతిరేకించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో 200లకు పైగా ప్రతికూల తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఇంతమంది అధికారులపై కోర్టు ధిక్కరణ కింద శిక్ష పడలేదని పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పటికే అన్ని రకాలుగా వెనుకబడిందని ఆయన ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సరిదిద్దాల్సిన బాధ్యత ఐఏఏస్ అధికారులపై ఉందని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
MSME Funds: రూ.1,124 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల