కార్పొరేషన్ పరిధిలో పన్నులు పెంచుతారంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. నగర పన్నుల విధానంపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారంంలో ఆయన పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైకాపా అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అబివృద్ధి కావాలంటే తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి:
'ఉక్కు కర్మాగారంలో స్థలాలు కొట్టేసేందుకు సీఎం జగన్ ప్రణాళిక'