నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే నిధులు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి వేణుగోపాల్ అన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందేందుకే వారి ఖాతాల్లోకి 18,750 రూపాయల చొప్పున జమ చేశామని చెప్పారు. ప్రజల పట్ల ఆలోచించని తెదేపాకు విమర్శలు చేసే హక్కులేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే పసుపు - కుంకుమ పేరిట పంపకాలు చేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: