ETV Bharat / city

ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థుల సమాచారం కోసం ప్రత్యేక ఫోన్​నంబర్లు - ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థులకు మంత్రి ఆదిమూలపు సురేశ్ భరోసా

Minister suresh on students in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యకు దిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. ఈ మేరకు ఏపీ భవన్​లో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సాయం కోసం విద్యార్థులు సంప్రదించాల్సిన పలు ఫోన్​ నంబర్లను వెల్లడించారు.

Minister suresh  on students in Ukraine
Minister suresh on students in Ukraine
author img

By

Published : Feb 24, 2022, 9:15 PM IST

Updated : Feb 24, 2022, 9:55 PM IST

Ukraine Crisis: ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ అన్నారు. ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రనికి రప్పించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్.. కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ విమాన సర్వీసులు రద్దయ్యాయని,ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్​ని నియమించినట్లు చెప్పారు. ఏపీ భవన్​లో అధికారులను అప్రమత్తం చేశామని.. పరిస్థితులు చక్కబడగానే విద్యార్థులను రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంప్రదించాల్సిన నంబర్లు..

  • నోడల్ అధికారిగా(ఏపీ భవన్​) రవి శంకర్- 9871999055
  • అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ- 7531904820
  • ఏపీఎన్​ఆర్​టీ సీఈవో దినేశ్​ కుమార్ -9848460046

ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం మొదలు కావడంతో తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నెలకొందన్నారు. ఉక్రెయిన్​లోని మెడికల్ కళాశాలల విద్యార్దులతో మాట్లాడిన మంత్రి సురేశ్​.. అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉక్రెయిన్​లో ఉన్న తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని..విద్యార్థులను రప్పించేందుకు ఏపీ సర్కార్​ ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

ఇదీ చదవండి: విజయవాడ నుంచి చెన్నైకి అవయవాల తరలింపు

Last Updated : Feb 24, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.