జాతీయ నూతన విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఉపాధ్యాయులు దీనిపై ఎటువంటి అపోహలు అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకుంటున్న కొన్ని చర్యలపై ఉపాధ్యాయులు రకరకాల ఊహగానాలు తెస్తున్నారని, ప్రస్తుతం వీటి అమలుపై చర్యలు పరిశీలనలోనే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను ఆదేశించామని మంత్రి సురేష్ తెలిపారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: Jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ