సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విధి విధానాల రూపకల్పనకు మంత్రుల కమిటీ వేసినట్లు తెలిపారు. నివేదిక రాగానే ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని శాసన మండలిలో వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శాసన మండలి సభ్యులు లేవనెత్తిన పలు అనుమానాలు, సందేహాలకు బుగ్గన సమాధానం ఇచ్చారు. నాయిబ్రాహ్మణులు, రజకులతో పాటు భవిష్యత్తులో మిగిలిన కులవృత్తుల వారికీ పదివేల ఆర్థిక సాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పలు శాఖలకు నిధులు కేటాయించినట్లు బుగ్గన తెలిపారు. నవరత్నాలు సహా సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు కచ్చితంగా ఖర్చు పెట్టాలా చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి దశలవారీగా 75 వేల రూపాయలు కార్పోరేషన్ ద్వారా ఇస్తామన్నారు.
ఇదీ చదవండి :