రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన ఎస్టీ సబ్ ప్లాన్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సమావేశమైంది. గత ఏడాది మొదలుపెట్టిన పనుల్లో ప్రారంభం కాని వాటిని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని పనులను మరోసారి సమీక్షించుకొని, ఏది అవసరమో, ఏది అనవసరమో నిర్ణయించాలని మంత్రి సూచించారు. అందుబాటులో ఉన్న నిధులతో కొత్త పనులను చేపట్టడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వైద్య విభాగానికి సంబంధించిన సేవలను గిరిజన ప్రాంతాల్లో మరింతగా మెరుగుపర్చాలన్నారు. దీని కోసం అవసరమైన వైద్య సిబ్బందిని నియమించడంతో పాటుగా ఇప్పటికే పని చేస్తున్న వారికి డిప్యుటేషన్ల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు.
'ప్రతి రూపాయీ...వారి అభివృద్ధికే ఖర్చు చేయాలి' - ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సమావేశం
ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో ప్రతి రూపాయీ... గిరిజనాభివృద్ధి కోసమే ఉపయోగపడేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కోరారు. గిరిజనాభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఎస్టీ సబ్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వం 4 వేల 988 కోట్లు కేటాయించిందన్నారు.గత ఏడాది కేటాయించిన బడ్జెట్ కంటే ఇది 812 కోట్లు అధికమన్నారు.