ETV Bharat / city

'​ నష్టాలను తగ్గించడంపై.. డిస్కంలు దృష్టిపెట్టాలి' - Minister Peddireddy review on discos

విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కమర్షియల్​ నష్టాలను తగ్గించడంపై డిస్కంలు దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు.గత ప్రభుత్వం అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల ఏటా డిస్కంలపై రూ. 3,500 కోట్ల అదనపు భారం పడుతోందని ఆరోపించారు.

peddireddy
peddireddy
author img

By

Published : Apr 20, 2022, 5:28 AM IST

గత ప్రభుత్వం అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల ఏటా డిస్కంలపై రూ. 3,500 కోట్ల అదనపు భారం పడుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. మార్కెట్‌లో యూనిట్‌ రూ. 2.44కు లభిస్తుంటే.. (బ్యాక్‌డౌన్‌ ఛార్జీలు యూనిట్‌కు రూ. 3.54 కలిపి) యూనిట్‌కు రూ. 8.09 వంతున తీసుకునేలా పీపీఏలు కుదుర్చుకుందని పేర్కొన్నారు. సచివాలయంలో పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ, మూడు డిస్కంల సీఎండీలతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘2014-19 మధ్య కాలంలో డిస్కంల నష్టాలు రూ.7,000 కోట్ల నుంచి రూ. 27,000 కోట్లకు చేరాయి. అప్పులు రూ. 31,000 కోట్ల నుంచి రూ. 62,000 కోట్లకు పెరిగాయి. గత ప్రభుత్వం సబ్సిడీల కింద ఏటా రూ.4,000 కోట్లు మాత్రమే డిస్కంలకు చెల్లించింది. మేం వచ్చాక 2019 నుంచి ఏటా రూ. 9,000 కోట్లకు పైగా సబ్సిడీ కింద ఇస్తున్నాం. ప్రభుత్వ విభాగాలు వినియోగించిన విద్యుత్‌కు గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్లకు రూ. 24,165 కోట్లను చెల్లిస్తే.. మేం ఇప్పటి వరకు రూ. 35,963 కోట్లను ఇచ్చాం. రాష్ట్ర విభజన నాటికి ఏపీపీడీసీఎల్‌ (రాష్ట్ర విద్యుత్‌ అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌) పేరిట నిర్వహణ మూలధన రుణాలు లేవు. 2014-19 మధ్య రూ. 6,000 కోట్ల మేర ఈ రుణాలు తీసుకుంది. మూల ధన రుణాలు రూ.7,839.60 కోట్లు కాగా 2019 మార్చి నాటికి రూ.13,253.68 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఏపీపీడీసీఎల్‌ రుణాలు రూ. 14,159.66 కోట్లు. నిర్వహణ రుణాలు రూ. 5,469.36 కోట్లుగా ఉన్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు.

అనవసర వ్యయాన్ని నియంత్రించాం

వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అనవసర వ్యయాన్ని నియంత్రించడంతో పాటు చౌక విద్యుత్‌ కొనుగోళ్ల ద్వారా సుమారు రూ. 4,925 కోట్లను ఆదా చేసినట్లు వెల్లడించారు. ‘వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘సెకి’ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకుంటోంది. దానిని 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేక డిస్కం ద్వారా అందిస్తాం’ అని పేర్కొన్నారు. పంపిణీ నష్టాలను సాధ్యమైనంత మేరకు తగ్గించేలా చూడాలని డిస్కంలకు సూచించారు. చౌర్యాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌, ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీతేజ, డిస్కంల సీఎండీలు హరనాథరావు, పద్మాజనార్దన్‌రెడ్డి, సంతోష్‌రావు పాల్గొన్నారు..
ఇదీ చదవండి: ఇలాంటి మంత్రివర్గం.. రాష్ట్ర చరిత్రలోనే చూడలేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.