వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణ ప్రాంతాలు మినహా 162 నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకం పనులు ప్రారంభించామన్నారు. ఈ పథకంలో భాగంగా ఉచిత బోరుతో పాటు మోటార్ లేదా పంపుసెట్‌ను ఉచితంగానే అందజేస్తున్నామన్నారు.
వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వ్యవసాయ బోర్లు తవ్వటం ద్వారా ఐదు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకరావాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పథకం ద్వారా సుమారు 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. బోర్లు తవ్వకానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని...పథకం కోసం ఐదు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తొలిరోజే 162 డ్రిల్లింగ్ పాయింట్‌లలో బోర్ల తవ్వకాలకు సన్నాహాలు జరిగాయన్నారు.
ఇదీచదవండి