కరోనాపై పోరులో విశేష కృషిచేస్తోన్న వైద్య సిబ్బందిని సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వారి సేవలకు సంఘీభావం ప్రకటించారు.
ప్రాణాలకు తెగించి కొవిడ్-19 బాధితుల చికిత్స అందిస్తోన్న మెడికల్, పారామెడికల్ వైద్య సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్న వారికి ఊపిరి పోసి దేశ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని ప్రశంసిస్తూ ఓ వీడియోను జతచేశారు. కాగా వైద్యసిబ్బంది సేవలకు గౌరవ ప్రదంగా ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేవ దళాలు పూలవర్షం కురిపించనున్నాయి.
ఇవీచూడండి: