ETV Bharat / city

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ప్లాన్: మంత్రి కొట్టు

author img

By

Published : May 24, 2022, 8:40 PM IST

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ప్లాన్ చేయబోతున్నామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన.. దుర్గ గుడి అభివృద్ధికి సీబీఆర్‌ఐ ఏజెన్సీ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ప్లాన్

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు దిల్లీకి చెందిన సంస్థతో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేయిస్తున్నట్లు దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినా.. అవి సంతృప్తికరంగా లేవని అన్నారు. అందుకే దిల్లీకి చెందిన సీబీఆర్​ఐ ఏజెన్సీకి బాధ్యతను అప్పగించామన్నారు. వచ్చే 30 ఏళ్లలో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని అంచనా వేస్తూ.. ప్రస్తుతం వస్తోన్న భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదిగా సమకూర్చేందుకు ఈ ఫ్లాన్ తయారు చేయిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన చేయించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని... అందులో భాగంగానే పైలట్‌ ప్రాజెక్టుగా ఇంద్రకీలాద్రిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కేవలం 18 ఎకరాల పరిమిత విస్తీర్ణంలోనే ఇంద్రకీలాద్రి ఉందని... తక్కువ విస్తీర్ణంలోని ప్రదేశాన్ని మెరుగైన రీతిలో వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొండ దిగువన ఉన్న గోశాలను వేరే చోటకు తరలించాలని చూస్తున్నామని తెలిపారు. ఈ ప్రదేశంలో ప్రసాదం పోటు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

ఇంద్రకీలాద్రి, కనకదుర్గానగర్‌లలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, ఈవో భ్రమరాంబలతో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశం, అన్నప్రసాదం, ప్రసాదం పోటు ఇతర భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. కొండచరియలు విరిగిపడుతున్నందున ఘాట్ రోడ్డు ద్వారా రాకపోకలు తగ్గిస్తామన్నారు. భక్తులు, వీవీఐపీలు ఎవరొచ్చినా మహామండపంలోని రాజగోపురం ద్వారానే దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ తయారీకి రెండు నెలల సమయం పడుతుందని మంత్రి కొట్టు వెల్లడించారు. ఇంద్రకీలాద్రి కొండ పైభాగానికి మెట్లు వేసి వ్యూ పాయింట్ తయారు చేస్తామని చెప్పారు. దుర్గగుడి అభివృద్ధికి నిధుల కొరత లేదని.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రసాద్‌ పథకం కింద రూ.50 కోట్లు పొందేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.