సాగు నీటి అంశాలపై తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు భాషా సంస్కారానికి సంబంధించిన అంశమని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు హీరోయిజం కోసం మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. రాయలసీమ జిల్లాలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలని అన్నారు. ఒక పాలకుడిగా ఆ ప్రాంతాల దాహార్తిని తీర్చే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారన్నారు.
ఇదీచదవండి
SRINIVAS GOUD: వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్