ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ 2020 డైరీని విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, 13 జిల్లాల అగ్రికల్చర్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడ్డారని, 30 శాతం జీడీపీ వ్యవసాయ రంగానిదేనని మంత్రి కన్నబాబు వివరించారు. 11 వేల 128 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులకు భరోసా అందించామని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగుల కృషి మరువలేనిదన్నారు. వ్యవసాయశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలో చేపడతామన్నారు.
ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఉపరాష్ట్రపతి ఆరా