MINISTER KAKANI: రాష్ట్రంలో కొందరు కౌలు రైతులు తమకు పంట సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్‌సీ) అవసరం లేదనే.. వ్యవసాయం చేసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న రైతుల భూములను కొందరు కౌలుకు చేస్తున్నారనే ఉదంతాల వల్లే సీసీఆర్సీ కార్డులు జారీ కావటం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే సీసీఆర్సీ కార్డులు జారీ అవుతాయని ఆయన వెల్లడించారు. సీసీఆర్సీ కార్డులు అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా.. కొందరు కౌలురైతులు తీసుకోవటం లేదన్నారు.
కౌలు రైతుల ఆత్మహత్యలపై మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు. పట్టాదారు పాస్ పుస్తకం, సీసీఆర్సీ కార్డు లేని రైతులకు ప్రభుత్వం పరిహారం అందించలేదని ఎవరైనా రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. సీసీఆర్సీ కార్డు లేకపోయినా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా లక్ష రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. గతంలో ఎందుకు మాట్లడలేదని మంత్రి ప్రశ్నించారు. కరెంటు ఆదా చేసేందుకు వ్యవసాయ మీటర్లు పెడితే చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.
సీసీఆర్‌సీ అంటే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కౌలుదారులకు కూడా రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కౌలు రైతులందరికీ ప్రభుత్వ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో పంట సాగు హక్కుదారుల చట్టాన్ని తీసుకొచ్చింది.
ఇవీ చదవండి: