2019-20లో 187 సంస్కరణల పాయింట్లు అమలు చేశామని మంత్రి మేకపాటి తెలిపారు. 12 అంశాల్లో కేంద్రం సర్వే చేసిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7 వేల పరిశ్రమల పేర్లు కేంద్రానికి ఇచ్చామన్నారు. కరోనా సమయంలోనూ ఇన్సెంటివ్స్ ఇవ్వడంతోపాటు, విద్యుత్ మినిమం డిమాండ్ ఛార్జీలు తొలగించామన్నారు. ఉత్తర్‌ప్రదేశ్
ఈసారి గట్టి పోటీ ఇచ్చిందన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి... ర్యాంక్ విషయం ముఖ్యమంత్రికి చెప్పే లోపు... లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అంతా గత ప్రభుత్వం వల్లే అని లోకేష్ చెప్పుకున్నారని విమర్శించారు. అన్ని తెలిసి కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు వైకాపా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. తాము ఎంఎస్ఎంఈ లకు అవసరమైన సంస్కరణలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 32 లక్షల కోట్లకు అవగాహన ఒప్పందాలు చేసుకుందన్నారు. కనీసం 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదని తెలిపారు. కియా తీసుకురావడం అభినందనీయం, కానీ వారికి 20 ఏళ్ల పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. యాపిల్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని గౌతమ్‌రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో యాపిల్ యూనిట్ వస్తుంది అని భావిస్తున్నామన్నారు. భూ కేటాయింపులోనూ సంస్కరణలు చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై ప్రత్యేక కమిటీ దర్యాప్తు