500 యూనిట్లు దాటితేనే కొత్త విద్యుత్ టారిఫ్ వల్ల ఇబ్బంది ఉంటుందని మంత్రి బుగ్గన అన్నారు. రెండు మూడు ఏసీలు ఉన్నవారికే 500యూనిట్లు దాటుతుందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి పేర్కొన్నారు. లాక్‌డౌన్ వల్ల అంతా ఇళ్లలో ఉన్నారని..విద్యుత్ అధిక వినియోగం ఆధారంగానే బిల్లులు వచ్చాయని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్