రాష్ట్రంలో 3 రాజధానుల వివాదం ఇంకా చల్లారలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా.. వైకాపా మంత్రులు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానుల అంశంపై స్పందించారు. మూడు రాజధానులే తమ పార్టీ, ప్రభుత్వ విధానమని మంత్రి పునరుద్ఘాటించారు.
‘‘3 రాజధానులు అనేది మా పార్టీ, ప్రభుత్వ విధానం. ఇదే మా విధానమని మొదట్నుంచీ చెబుతున్నాం. రాష్ట్రసమగ్రాభివృధ్ధే మా లక్ష్యం. ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. సమయం చూసుకుని అసెంబ్లీలో బిల్లు పెడతాం. స్మార్ట్ సిటీ మిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన వారికి ఇంకా పెద్ద పదవి ఇస్తామేమో’’ అని బొత్స వ్యాఖ్యానించారు.
త్వరలోనే అన్నిటికి పరిష్కారం..
ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామని.., అన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్ని సంఘాల వారికి వచ్చే నెల 4న చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. మున్సిపల్ పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెంపు, పీఎఫ్ వంటి సమస్యలు విన్నవించారని.. వాటన్నింటిని పరిష్కారిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
అమలోకి రానున్న కొత్త మైనింగ్ విధానం... లీజుకు ఈ-వేలంలో గుత్తేదారులు