ETV Bharat / city

Minister Botsa: అప్పులు చేసి ఆ డబ్బులు మా ఇంట్లో పెట్టుకున్నామా?: మంత్రి బొత్స

author img

By

Published : Apr 1, 2022, 9:05 AM IST

Minister Botsa: అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి బొత్స తిప్పికొట్టారు. అప్పు తెచ్చిన డబ్బును మా ఇంట్లో దాచుకోవడం లేదని.. ప్రతి అప్పుకు ఓ లెక్క ఉందని అన్నారు.

minister botsa satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa: ‘అప్పులు చేసి ఆ డబ్బును మా ఇళ్లలో పెట్టుకున్నామా? లేకపోతే చంద్రబాబులాగా స్నోలు, పౌడర్లకు దుర్వినియోగం చేశామా? ప్రభుత్వం చేస్తున్న ప్రతి అప్పునకూ లెక్క ఉంది’ అని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అప్పులు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

‘ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వడం లేదా? ఈ మూడేళ్లలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.1.32 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయలేదా? రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెట్టడం లేదా? వీటన్నింటికీ లెక్కలున్నాయి. ప్రజల కోసం పారదర్శకంగా చేస్తున్న ఖర్చుపై సీబీఐ విచారణ చేయించాలనడం విడ్డూరంగా ఉంది..అలాంటపుడు కాగ్‌, ఇతర ఏజెన్సీలు ఎందుకున్నాయి? రూ.50వేల కోట్లకు లెక్కలు లేవంటూ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. పరిజ్ఞానం, పరిపక్వత ఉండి మాట్లాడే మాటలేనా అవి?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రాక్టికల్‌గా మాట్లాడితే బాగుంటుందన్నారు మంత్రి బొత్స.

చంద్రబాబు హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదా?: ‘ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలను పెంచితే.. దానిపై మాట్లాడినా అర్థం ఉంటుంది. అసలు విద్యుత్‌ ఛార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎందుకంటే విద్యుత్‌ ఛార్జీల పెంపు పేటెంట్‌ ఆయనదే. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. పరిశీలించి దానిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని బొత్స స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లాలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు.. కేంద్రం ఆమోదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.