ETV Bharat / city

TIDCO: దరఖాస్తులు పంపిన వారందరికీ రుణాలు - Minister Botsa Satyanarayana latest news

టిడ్కో లబ్ధిదారులకు రుణాల కోసం బ్యాంకులకు పంపిన దరఖాస్తులు, రుణాల మంజూరు, విడుదల అంశాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని, దీన్ని అధిగమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పంపినవారందరికీ రుణాలు మంజూరయ్యేలా చూడాలని సూచించారు.

మంత్రి బోత్స సత్యనారాయణ
మంత్రి బోత్స సత్యనారాయణ
author img

By

Published : Sep 5, 2021, 5:18 AM IST

టిడ్కో లబ్ధిదారులకు రుణాల కోసం బ్యాంకులకు పంపిన దరఖాస్తులు, రుణాల మంజూరు, విడుదల అంశాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని, దీన్ని అధిగమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పంపినవారందరికీ రుణాలు మంజూరయ్యేలా చూడాలని సూచించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన టిడ్కో ఛైర్మన్‌ జె.ప్రసన్నకుమార్‌, ఎండీ శ్రీధర్‌, మెప్మా ఎండీ విజయలక్ష్మితో కలిసి వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో సమీక్షించారు.

కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు దస్తావేజులు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని, అలాంటి వాటికి తావివ్వకుండా లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియ వేగవంతమయ్యేలా జిల్లాల్లోని టిడ్కో ఇంజినీర్లు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అన్నారు. లబ్ధిదారులకు సేల్‌ అగ్రిమెంట్ల పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియలో నిర్లిప్తత వద్దని సూచించారు.

ఇదీ చదవండి:

డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.