త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని.. ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఈ అంశంపై న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని.. వివాదం పరిష్కారం కాగానే విశాఖలో కార్యనిర్వహణ రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. అమరావతి అభివృద్దిపై సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉందన్నారు. అమరావతిలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనికోసం రూ.3 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి అభివృద్ది చేయాలని నిర్ణయించామన్నారు.
ఇదీచదవండి