ETV Bharat / city

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచండి: మంత్రి ఆళ్ల నాని - ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ న్యూస్

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచేందుకు కార్యాచరణ చేపట్టాల్సిందిగా మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. పరీక్షల సంఖ్య కూడా పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచేందుకుగానూ గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్​గా తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచండి

author img

By

Published : Mar 19, 2021, 7:57 PM IST

ఏపీలో ఇప్పటి వరకూ 13 లక్షల 80 వేల మంది కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసు పొందారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్​పై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ప్రక్రియలో వేగం పెంచేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. పరీక్షల సంఖ్య కూడా పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచేందుకుగానూ గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్​గా తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో అర్హులైన వారికి సత్వరమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. వందశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడంతో పాటు వైరస్ నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏపీలో ఇప్పటివరకు 3 లక్షల 22 వేల 102 మంది హెల్త్ కేర్ వర్కర్స్​కి మొదటి డోస్, ఒక లక్ష 88 వేల 407 మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. 3 లక్షల 40 వేల 620 మంది ఫ్రంట్​లైన్ వర్కర్లకు మొదటి డోస్​, 68 వేల 345 మందికి రెండొవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇప్పటి వరకూ 2 లక్షల 81 వేల మంది వ్యాక్సీన్ వేయించుకున్నారన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు పైబడిన వ్యక్తులు 98 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.

ఇదీచదవండి: కరోనా 2.0: థియేటర్లలో మళ్లీ 50% రూల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.