ETV Bharat / city

మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వాలనేది మా లక్ష్యం: మంత్రి సురేశ్‌

author img

By

Published : Apr 20, 2022, 4:09 PM IST

ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. డిసెంబరు 2022 కల్లా 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వాలనేది మా లక్ష్యం

మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 430 చదరపు గజాల్లోని ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల వాటా రూ.25 వేలకు మాత్రమే పరిమితం చేస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబరు 2022 కల్లా 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ముందుగా తాగునీరు, సీవరెజీ ట్రీట్​మెంట్ ప్లాంట్​లు, మురుగునీరు సదుపాయాలు కల్పించిన తర్వాత లబ్దిదారులకు ఇళ్లను అందిస్తామని తెలిపారు. అప్లోడ్ చేసిన బిల్లులను ప్రతీ నెలా చెల్లింపులు పూర్తి చేస్తామని సురేశ్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పూర్తైన ఇళ్లను వచ్చే నెలలో లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్ల వద్ద శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు లేవని మంత్రి విమర్శించారు. దశలవారీగా ఒక్కో ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

"మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వాలనేది మా లక్ష్యం. 430 చదరపు గజాల్లోని ఇళ్లకు లబ్ధిదారుల వాటా రూ.25 వేలు మాత్రమే. ఈ ఏడాది డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు యత్నం. ముందుగా మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందిస్తాం. తాగునీరు, కాలువలు, ఎస్‌టీపీలు నిర్మించాక లబ్ధిదారులకు అందిస్తాం. వచ్చే నెల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్ల కేటాయింపు. ఒక్కో ప్రాంతంలో దశలవారీగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం." -ఆదిమూలపు సురేశ్‌, పురపాలకశాఖ మంత్రి

ఇదీ చదవండి: విధిలేక ఒప్పుకున్నాం.. పీఆర్సీపై ఏ ఉద్యోగీ సంతృప్తిగా లేరు: సూర్య నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.