ETV Bharat / city

ఐటీ విభాగం సదా సిద్ధంగా ఉండాలి: మంత్రి గౌతమ్ రెడ్డి

ప్రభుత్వ కార్యకాలాపాలకు సాంకేతికపరమైన ఇబ్బంది లేకుండా చూడాలని... అధికారులను ఐటీ శాఖ మంత్రి గౌతమ్​రెడ్డి ఆదేశించారు. ఈ- ఫైళ్ల క్లియరెన్స్​లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

miniser gowtham reddy review on it department services
అధికారులతో మంత్రి సమీక్ష
author img

By

Published : Dec 28, 2019, 7:32 PM IST

ఐటీ విభాగంపై మంత్రి సమీక్ష

ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరితగతిన చేరవేసేందుకు... ఐటీ విభాగం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ- ఫైళ్ల క్లియరెన్సులో అత్యంత వేగంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి... ప్రభుత్వ కార్యకాలాపాలకు సాంకేతికపరమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జనవరి 2020 నుంచి గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పెద్దఎత్తున ఈ- ఫైళ్లు వస్తాయని అన్నారు. ఏపీఐఐసీకి సంబంధించిన భూ బ్యాంకును పారిశ్రామికవేత్తలే ఎంచుకునేలా ఆన్​లైన్​లో వివరాలను ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని అంశాలనూ డిజిటలైజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:అసలేంటా 'బోస్టన్​' కన్సల్టింగ్ గ్రూప్..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.