గృహ రుణాల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం అమలుకు నియమించిన మంత్రుల కమిటీ తొలిసారిగా భేటీ అయింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు తీసుకున్న రుణాల చెల్లింపునకు ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రకటించింది. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేల చొప్పున చెల్లింపునకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కేటగిరీల వారీగా ఓటీఎస్ పథకం అమలుకు నిర్ణయం తీసుకోగా.. ఇవాళ జరిగిన తొలి సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, శ్రీరంగనాథరాజు, ధర్మాన పాల్గొన్నారు.
ఇదీ చదవండి
Somu Met Pawan: పవన్‌తో సోము వీర్రాజు భేటీ.. బద్వేలు ఉప ఎన్నికపై చర్చ !