విజయవాడలోని కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మాస్కే కవచం ప్రచార పోస్టర్ ను మంత్రి ఆళ్లనాని ఆవిష్కరించారు. మాస్కుల వినియోగం, తదుపరి నిర్వహణ తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కొవిడ్ మహమ్మారిని అంతం చేయటమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృత పరచాలని మంత్రి పేర్కొన్నారు.
ఉపయోగించిన మాస్కుల్ని మూడు రోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారేయాలని స్పష్టం చేశారు. అలాగే పునర్వినియోగ మాస్కులను శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయాలని తద్వారా స్వీయ రక్షణతో పాటు ఇతరులకు వైరస్ సోకకుండా చూసుకోవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి: