ETV Bharat / city

'గతంలో ఎన్నో కమిటీలు వేశారు.. ఏమీ నిరూపించలేదు' - జగన్ పై యనమల కామెంట్స్

జగన్‌ అక్రమాస్తుల కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సిట్‌ను తెరపైకి తెచ్చారని తెదేపా నేత యనమల విమర్శించారు. తెదేపాను అప్రదిష్టపాలు చేసేందుకే ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందని మండిపడ్డారు. 9 నెలల వైకాపా పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఎన్నో కమిటీలు వేశారు.. ఏమీ నిరూపించలేదు

author img

By

Published : Feb 23, 2020, 3:49 PM IST

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై సిట్ వేసిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా లేదని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ ట్రయల్స్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైకాపా పన్నాగాలు పన్నిందన్నారు. అవినీతి కేసుల్లో జగన్‌పై విచారణ తుది దశకు చేరుకోవటంతో దాన్ని కప్పిపుచ్చేందుకు సిట్ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. 9 నెలలుగా ప్రభుత్వం.. గత ప్రభుత్వంపై అనేక విచారణలు చేసి ఏమీ రుజువు చేయలేకపోయిందన్నారు. తమకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులతో సిట్ వేయటాన్ని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. 9 నెలల ప్రభుత్వ అవినీతి అక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్‌ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని... యువత ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

'అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా రేపు ధర్నాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.