ETV Bharat / city

యువకుడి కిడ్నాప్.. నగరమంతా తిప్పిన దుండగులు - kindap at vijayawada

విజయవాడ నగరంలో యువకుడిని పది మంది కిడ్నాప్ చేసి.. నగరం అంతా తిప్పి, కొట్టారు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వద్ద వదిలేశారు. తనను ఎందుకు కొట్టారో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Man kidnapped at vijayawada
విజయవాడలో యువకుడి కిడ్నాప్
author img

By

Published : Oct 3, 2020, 10:08 AM IST

విజయవాడ నగరంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. మాచవరం యారాం వారి వీధిలో కంచర్ల జగదీష్ అనే యువకుడిని పది మంది యువకులు కిడ్నాప్ చేశారు. గురువారం అర్ధరాత్రి సుమారు 10 మంది యువకులు అతని ఇంటికి వెళ్లి తలుపులు పగులకొట్టి జగదీష్ ను కిడ్నాప్ చేశారు. బలవంతంగా బయటకు తీసుకెళ్లి, నాలుగు గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పి తీవ్రంగా కొట్టి శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు గాంధీనగర్ పరిసరాల్లో వదిలేశారని పోలీసులు చెబుతున్నారు.

తనను ఎందుకు కొట్టారో తెలియక జగదీష్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు ఏడుగురు యువకులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు . మద్దాల నాగేంద్రబాబు, కె. భరత్ వర్మ, బి. శ్రీహర్ష, షేక్ సొహైల్, తేజపూర్ణ, బాపట్ల కాశీవర్ధన్, కె. రాహుల్​లను పోలీసు ప్రత్యేక బృందం స్థానిక మాచవరం స్టేషన్​లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.