ETV Bharat / city

SUICIDE ATTEMPT: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రిమాండ్​కి పంపుతారనే భయంతో.!

SUICIDE ATTEMPT: విజయవాడ పటమట పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి.. ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. పోలీసులు తనను రిమాండ్‌కు పంపుతారేమోననే భయంతో స్టేషన్‌లోని బాత్రూమ్‌లో వైరుతో గొంతు కోసుకున్నట్లు సమాచారం. ఇటీవల హత్యకు గురైన పుట్​బాల్ ప్లేయర్​ ఆకాష్‌ కేసులో అశోక్​తో పాటు మరో పది మందిని ఈ నెల 1న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

patamata police station
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 10, 2022, 11:28 AM IST

SUICIDE ATTEMPT: విజయవాడ పటమట పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి.. ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఇటీవల హత్యకు గురైన పుట్​బాల్ ప్లేయర్​ ఆకాష్‌ కేసులో అశోక్​తో పాటు మరో పది మందిని ఈ నెల 1న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ మాచవరంలో బైక్ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. పోలీసులు తనను రిమాండ్‌కు పంపుతారేమోననే భయంతో స్టేషన్‌లోని బాత్రూమ్‌లో వైరుతో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే అశోక్‌ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి ఏమైనా జరిగితే.. తమకి ఇబ్బంది అవుతుందంటూ వైద్యులు చికిత్సకు నిరాకరించారు. అక్కడకు చేరుకున్న సౌత్‌ ఏసీపీ బి.రవి కిరణ్‌ ప్రాథమిక చికిత్స చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అశోక్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం తెలిసిన అశోక్‌ బంధువులు స్టేషన్‌కి చేరుకుని ఆందోళన చేశారు. కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా.. ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపించారు. మరోవైపు ఈ విషయంపై పోలీసులు ఎటువంటి సమాధానాలు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.