ETV Bharat / city

సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా మహేష్‌ చంద్ర లడ్డా - కేంద్ర సర్వీసుల్లోకి మహేష్ చంద్ర లడ్డా తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు పర్సనల్‌ విభాగం ఐజీ మహేష్‌ చంద్ర లడ్డా... సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా నియమితులయ్యారు. ఈ మేరకు అయిదేళ్లపాటు ఈ పోస్టులో డిప్యుటేషన్‌పై పని చేయనున్నారు. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు వీలుగా పర్సనల్‌ విభాగం ఐజీ పోస్టు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా మహేష్‌ చంద్ర లడ్డా
సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా మహేష్‌ చంద్ర లడ్డా
author img

By

Published : Nov 22, 2020, 9:54 AM IST

సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా.. సీఆర్​పీఎఫ్ ఐజీగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం శనివారు ఉత్తర్వులు జారీ చేసింది. గత 18 నెలల్లో నలుగురు అధికారులు కేంద్ర సర్వీసులకు, ఒకరు అంతర్రాష్ట్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. రైల్వే డీజీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు చేసుకున్న దరఖాస్తుకు ఇప్పటికే ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ దస్త్రం కేంద్ర హోం మంత్రిత్వశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. గుంటూరు అర్బన్‌ ఎస్పీగా పనిచేసిన ఆర్‌.జయలక్ష్మి గతేడాది ఆగస్టులో సీబీఐ ఎస్పీగా దిల్లీ చేరారు.

కర్నూలు బెటాలియన్‌ కమాండెంట్‌ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యక్తిగత కారణాలతో ఆయన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అమిత్‌ గార్గ్‌ జాతీయ పోలీసు అకాడమీ జాయింట్‌ డైరెక్టరుగా... గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగం ఏడీజీగా ఉన్న నళిన్‌ ప్రభాత్‌ సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా, సీఐడీ ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోకి మారారు. వీరు కాక మరో ఇద్దరు అదనపు డీజీపీ స్థాయి అధికారులు, ఒక డీఐజీ స్థాయి అధికారి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చే అంశం నా చేతుల్లో లేదు: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.