ETV Bharat / city

వందనాలమ్మా... మీకూ వందనాలమ్మా..! - mothers day latest news

అమ్మ- ప్రేమకు మారుపేరు. అమ్మ మనసు పూలతేరు... అన్నారో సినీకవి. ఆ మనసులో బిడ్డకే కాదు తన, పర భేదం లేకుండా ఎందరికో చోటుంటుంది. ఎంత పెద్ద మనసులు కాకపోతే ప్రమాదం పొంచి ఉందని తెలిసినా..... ఇంట్లో పిల్లల్ని వదిలి తాము విధినిర్వహణకు అంకితమవుతారు! అందుకే... ఆ అమ్మలందరికీ వేనవేల వందనాలు!

ot of mothers participate along with the fight with Corona
వందనాలమ్మా... మీకూ వందనాలమ్మా..!
author img

By

Published : May 10, 2020, 9:30 AM IST

Updated : May 10, 2020, 10:10 AM IST

అమ్మంటేనే ఇరవై నాలుగ్గంటల పని. ఆ పనికి ఉద్యోగభారమూ తోడైనా ఆమె కష్టం అనుకోకుండా ఇష్టంగానే చేస్తుంది. అందుకే కరోనా వేళ సమాజమంతా లాక్‌డౌన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నా- డాక్టర్లుగా, నర్సులుగా, ప్రభుత్వ అధికారులుగా... అమ్మలెందరో ముందు వరసలో నిలిచి సేవలందిస్తున్నారు. ఇంటి దగ్గర బెంగపెట్టుకున్న బిడ్డను ఊరడించినంత ఓపిగ్గా ఉద్యోగబాధ్యతల్నీ నిర్వహిస్తున్నారు. కరోనాపై పోరాటంతో ఎందరికో స్ఫూర్తినిస్తున్న అలాంటి మహిళల గురించి... అమ్మలపండగ (ఈరోజు మదర్స్‌ డే) సందర్భంగా...

జిల్లా ప్రజలందరికీ అమ్మని...: పౌసుమి బసు

పౌసుమి బసు
పౌసుమి బసు

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసుకి ఇంట్లో వృద్ధులైన అమ్మానాన్నా, ఇద్దరు చిన్న పిల్లలూ ఉన్నారు. వారిని చూసుకుంటూ ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్సులూ సమావేశాలూ నిర్వహిస్తూ ఫోను మీద అధికారులకు ఆదేశాలిస్తూ పాలనా బాధ్యతల్ని నిర్వహించవచ్చు. కానీ కరోనా సమయంలో ప్రజలకు దగ్గరగా ఉండటం ముఖ్యమనుకున్న ఆమె రెండు నెలలుగా ఇంటికీ పిల్లలకీ దూరంగా ఉంటున్నారు. వికారాబాద్‌లోనే కలెక్టర్‌ బంగ్లాలో ఉంటున్న పౌసుమి ‘ఇప్పుడు నేను పిల్లలకు వాట్సాప్‌ అమ్మనైపోయా. రోజూ ఏమేం చేయాలో చెబుతాను. పనివాళ్లు లేరు కాబట్టి అమ్మమ్మకీ తాతయ్యకీ పనుల్లో సాయం చేయడం, చెల్లెల్ని ఆడించడం, నాన్న సాయంతో హోంవర్కు చేసుకోవడం... పదేళ్ల పెద్ద పాప బాధ్యతలు. మూడేళ్ల చిన్నదానికి నచ్చజెప్పడమే కష్టంగా ఉంది. ఫోను చేయగానే ఇంటికి రమ్మంటుంది. వెళ్లి అరగంటలో చూసొచ్చేద్దామని మనసు పీకుతుంటుంది కానీ రిస్క్‌ తీసుకోవడం ఎందుకని ఊరుకుంటున్నా’నంటారు. రోజూ రాత్రి పూట వీడియో కాల్స్‌ చేసి పిల్లల మీద బెంగ తీర్చుకుంటున్న ఆమె పరిస్థితులకు తగినట్లుగా సర్దుకుపోవడం పిల్లలూ నేర్చుకోవాలిగా మరి- అంటారు.

వికారాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగానే రావడంతో పగలంతా ఆమెకి క్షణం తీరిక ఉండడం లేదు. ప్రత్యేకించి సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండేలా చూస్తూ పోలీసు అధికారులతో కలిసి జిల్లాలో పర్యటిస్తున్నారు. రోజూ సాయంత్రం వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ పెట్టి సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా కంటెయిన్‌మెంట్‌ జోన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వైద్యబృందాలతో ఇంటింటి సర్వే చేయించారు. రోజూ ఒక అరగంట ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమం పెట్టారు. ఓ పక్క కరోనాని కట్టడి చేస్తూనే మరోపక్క ధాన్యం సేకరణ, ఉపాధి హామీ, నీటి సంరక్షణ లాంటి పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు ఈ కలెక్టరమ్మ.

బాబుని తీసుకుని ఆఫీసుకు వచ్చా..: సృజన గుమ్మళ్ల

సృజన గుమ్మళ్ల
సృజన గుమ్మళ్ల

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన గుమ్మళ్ల ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు కరోనా విపత్తు విరుచుకుపడింది. అయినా ఆమె తన సెలవును వాడుకోవచ్చు. పసిబిడ్డ తల్లిగా పూర్తి సమయాన్ని బిడ్డకు కేటాయించడం ఆమె హక్కు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పడానికి లేదు, అయినా ఆమెకు మనస్కరించలేదు. సెలవు రద్దు చేసుకుని విధుల్లో చేరిపోయారు. ‘నేను లేకపోతే ఇక్కడేదో ఆగిపోతుందని కాదు. కాకపోతే గతంలో ఎన్నడూ లేని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాం. అటు ప్రభుత్వానికీ ఇటు ప్రజలకీ కూడా అధికారుల అవసరం ఉన్న సమయం ఇది. అందుకే ఒక అధికారిగా నా బాధ్యత నిర్వర్తించాలనుకున్నాను. అందరం ఒకరికొకరం తోడుగా నిలబడితేనే కదా విపత్తు వేళల్లో ధైర్యంగా ఉండేది. బాబుకు తల్లిగా నా పనులు నేను చేసుకుంటూనే అధికారిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగలనని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటారు సృజన.

బాబు పుట్టిన తర్వాత నెలన్నా నిండకముందే విధుల్లో చేరిపోయారామె. భర్తా, కుటుంబసభ్యులూ ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. తమ సహకారం అందించడానికి ముందుకొచ్చారు. దాంతో అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుని పసిబిడ్డను ఒళ్లో పెట్టుకునే అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం మొదలెట్టారామె. ఆ దృశ్యాన్ని ఎవరో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ దాన్ని ట్వీట్‌ చేస్తూ ఇలాంటి అధికారులను చూసి దేశం గర్విస్తోందన్నారు. అందరు ఉద్యోగినుల్లానే ప్రసూతి సెలవు పెట్టినప్పుడు తానూ బిడ్డతో కొన్ని నెలలపాటు ఆనందంగా గడపొచ్చని అనుకునేదాన్ననీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదనీ అంటారు సృజన. తన నిర్ణయం వల్ల కొంతమందికి మేలు జరిగినా చాలంటారామె. బాబుని చూసుకుంటూ ఉద్యోగం చేయడం కొంచెం కష్టమే అయినా దీనివల్ల టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అలవాటు అయిందంటారు సృజన.

పిల్లల్ని దగ్గరకు తీసుకోలేకపోతున్నా...: డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి

డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి
డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి

ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ ప్రతిభాలక్ష్మికి ఇద్దరూ చిన్న పిల్లలు. వారికోసం ఒకప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లాలా అని ఎదురుచూసేదాన్ననీ ఇప్పుడు ఇంటికెళ్లాలంటే భయమేస్తోందనీ అంటారు ప్రతిభ. ‘ఒకరికి ఏడేళ్లు ఒకరికి మూడేళ్లు. ఇంటికెళ్లగానే చిన్నవాడు వచ్చి ఎత్తుకోమంటాడు. గంటల తరబడి పేషెంట్ల మధ్య ఉండి ఇంటికెళ్లాక పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలంటేనే భయమేస్తోంది. మనసారా వారిని గుండెలకు హత్తుకోలేకపోతున్నా. శుభ్రంగా స్నానం చేసినా ఒకవేళ అప్పటికే నాకు వైరస్‌ సోకితే నా ఊపిరి తగిలినా వాళ్లకి ప్రమాదమే కదా. పీపీఈలు ధరించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏవీ నూరు శాతం సురక్షితం కావు’ అంటారు ప్రతిభ. అందుకే పనిగంటలు ఎక్కువైనప్పుడు వైరస్‌ రిస్క్‌ ఎక్కువని పిల్లల్ని అమ్మమ్మా తాతయ్యల దగ్గర వదిలేస్తున్నారామె. కొన్నిరోజులు తమను తాము గమనించుకుని వైరస్‌ లక్షణాలు ఏమీ కన్పించకపోతే అప్పుడు పిల్లల్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఒకపక్క పెద్దవాళ్లకి పిల్లల బాధ్యత అప్పజెబుతున్నందుకూ, మరోపక్క తమవల్ల వాళ్లకి వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందుకూ చాలా ఒత్తిడికి లోనవుతున్నామంటారు ప్రతిభ.

ఉస్మానియా కోవిడ్‌ సెంటర్‌ కాకపోయినా తమకు ప్రమాదం ఎక్కువే నంటారామె. ఆస్పత్రులేవీ అందుబాటులో లేకపోయేసరికి ఉస్మానియాకి సీరియస్‌ కేసుల తాకిడి ఎక్కువైంది. వాటిల్లో తెలియకుండానే పాజిటివ్‌ కేసులూ ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగికి చికిత్స చేసేటప్పుడు డాక్టర్లకు సరైన జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఉండదు. కరోనా లక్షణాలు కన్పిస్తే అక్కడే పరీక్షించి పాజిటివ్‌ వస్తే గాంధీకి తరలిస్తున్నారు. దాంతో ఉస్మానియా సిబ్బందికీ కరోనా వైరస్‌ బాధితుల మధ్య గడపడం తప్పడం లేదంటారు ప్రతిభ.

నాన్న నాకు మరో బిడ్డ...: అరుణ, స్టాఫ్‌ నర్స్

అరుణ, స్టాఫ్‌ నర్స్‌
అరుణ, స్టాఫ్‌ నర్స్‌

గాంధీ ఆస్పత్రిని ప్రత్యేకంగా కొవిడ్‌ చికిత్సలకు కేటాయించడంతో అక్కడ సిబ్బంది గత రెండు నెలలుగా ఇంటినీ కుటుంబ సభ్యుల్నీ మర్చిపోయి విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్న అరుణకి ఇంటిని తలచుకోగానే నాన్న గుర్తొస్తాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ‘టీనేజ్‌లో ఉన్న పిల్లల గురించి నాకు దిగుల్లేదు, అమ్మానాన్నల్ని తలచుకుంటేనే బాధగా ఉంటుంది. నాన్నకి ఎనభై ఏళ్లు. తనకి పాక్షిక పక్షవాతం సమస్య ఉంది. చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తారు. నాకిప్పుడు తను చిన్న కొడుకుతో సమానం. ఇంటికెళ్లే వేళకి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంటారు. నేను వెళ్లేదాకా భోజనం చేయరు. అమ్మకీ డెభ్బై అయిదేళ్లు. షుగరూ హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉన్నాయి. నా వల్ల వాళ్లకి వైరస్‌ ప్రమాదం ఉంటుందని నేను ఇంటికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉంటున్నాను. నా భర్తా పిల్లలూ వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నెల రోజులు నాన్నని చూడకుండా ఎప్పుడూ లేను...’ అనే అరుణ డ్యూటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతిగృహంలో ఉంటున్నారు.

వారం రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. డిపార్ట్‌మెంట్‌లో అవసరాన్ని బట్టి నర్సుల విశ్రాంతి రోజులు మారుతుంటాయి. ఈ లోపల కరోనా వైరస్‌ సోకిన లక్షణాలేమైనా బయటపడితే క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్‌ అని తేలితే ఐసొలేషనూ తప్పదు. అవి రెండూ ఇప్పుడు తమకి మామూలు విషయాలై పోయాయంటారు అరుణ. ఆమె తోటి నర్సులు చాలామంది చిన్నపిల్లల్ని అమ్మా నాన్నల దగ్గరో అత్తామామల దగ్గరో వదిలేసి హాస్టల్లో ఉంటున్నారట. ‘ఎన్ని రోజులైనా, ఎంత పనైనా చేయొచ్చు, పని చేయడానికి మాకేం భయం లేదు కానీ కుటుంబానికి దూరంగా ఉండడమే బాధగా ఉంది. ప్రస్తుతం సమాజానికి మా అవసరం ఉంది కాబట్టి ఆ బాధను మౌనంగా భరిస్తున్నాం...’ అంటారామె.

నా గదిముందే కూర్చుంటాడు...: డాక్టర్‌ కీర్తి సబ్నిస్‌

డాక్టర్‌ కీర్తి సబ్నిస్‌
డాక్టర్‌ కీర్తి సబ్నిస్‌

వైరస్‌ అంటుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. మరి, ఆ అంటువ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ల పరిస్థితేమిటీ... రోగుల్ని అంటుకోకుండా ఉంటామంటే వారికి కుదరదు. డాక్టర్‌ కీర్తి సబ్నిస్‌ ముంబయిలోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో అంటువ్యాధుల నిపుణురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే మెర్స్‌, సార్స్‌, నిపా వైరస్‌లకు చికిత్స చేసిన అనుభవం ఉన్న ఆమె కొవిడ్‌-19 వాటన్నిటికన్నా భిన్నమైనదనీ తొందరగా వదిలేది కాదనీ అంటారు. ఆరేళ్ల కొడుకుని ఇంట్లో తన తల్లి సంరక్షణలో వదిలి విధులకు వస్తున్న ఆమె కరోనా భయాలన్నీ ఒకెత్తు... భావోద్వేగాలు ఒకెత్తు అంటారు. ‘బాబుది అంటువ్యాధుల ప్రమాదం గురించి అర్థం చేసుకునే వయసు కాదు. తన స్నేహితుల అమ్మల్లాగా నేను ఇంట్లో ఉండడం లేదని పేచీలు పెడతాడు. తనకోసమే మా ఇంట్లో ఉంటున్న అమ్మమ్మతో గొడవ పడుతుంటాడు. వాళ్లిద్దరి వయసుల్నీ దృష్టిలో ఉంచుకుని నేను రెట్టింపు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంట్లో నాకోసం ఒక గది ఉంచుకున్నాను. నా దుస్తులూ పడకా తినే పళ్లెంతో సహా అన్నీ విడిగానే ఉంటాయి.

ఇంటికి వెళ్లగానే నేరుగా నా గదిలోకి వెళ్లి బట్టలు ఉతికేసి, శుభ్రంగా తలారా స్నానం చేశాకే బయటకు వచ్చి వాడిని దగ్గరకు తీసుకుంటాను. నేనెప్పుడు తలుపు తీస్తానా అని నా గది ముందు కూర్చుని ఉండే వాడిని చూసి పైకి నవ్వుతాను కానీ లోపల దుఃఖంగా ఉంటుంది. బాబు నన్నెంత మిస్సవుతున్నాడో తలచుకుంటే బాధగానే ఉంటుంది కానీ ఉద్యోగంలో చాలామందికి సాయపడుతున్నానన్నదే తృప్తి... ’ అంటారు కీర్తి. అవుట్‌ పేషెంట్‌ విభాగంలో డ్యూటీ చేయాల్సి వస్తే దగ్గూజ్వరాలతో వచ్చే పేషెంట్లలో ఎవరికి పాజిటివ్‌ ఉంటుందో తెలియదు. ఇక, కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు చికిత్స చేసే ఐసీయూలో డ్యూటీ పడినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంటికి వెళ్లేటప్పుడు గుండెల్లో దడగానే ఉంటుందంటారు కీర్తి.

ఎత్తుకునేదాకా ఊరుకోదు...: డాక్టర్‌ ఆర్తీసింగ్‌ ఐపీఎస్‌

డాక్టర్‌ ఆర్తీసింగ్‌ ఐపీఎస్‌
డాక్టర్‌ ఆర్తీసింగ్‌ ఐపీఎస్‌

మొదట డాక్టరు ఆ తర్వాత పోలీసూ అయిన ఆర్తీ సింగ్‌ నాశిక్‌ గ్రామీణ ఎస్పీగా ఉన్నారు. ఆమె భర్త ముంబయిలో ఐపీఎస్‌ అధికారి. దాంతో ఇంట్లో ఇద్దరమ్మాయిల్ని తన తల్లికి అప్పగించి జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ‘రోజంతా అమ్మమ్మతో గడపాలంటే పిల్లలకు విసుగే. వాళ్లకోసం ఏ రాత్రి అయినా ఇంటికి చేరుకుంటాను. పెద్దపాపకి పదేళ్లు, కాస్త పరిస్థితుల్ని అర్థం చేసుకుంటోంది. నాలుగేళ్ల చిన్నదానితోనే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటికెళ్లగానే తనని ఎత్తుకోకపోతే నానా గొడవా చేస్తుంది. వెనక గేటులోంచి నిశ్శబ్దంగా వెళ్లి తలంటు స్నానం చేశాకే తనకి కనబడుతున్నా. రోజూ ఇదో పెద్ద పరీక్ష అయిపోయింది నాకు...’ అంటారు ఆర్తి. ఈ ఐపీఎస్‌ అధికారి ఎక్కడ ఉన్నా ఆ విధులకు అదనంగా తన డాక్టర్‌ నైపుణ్యాలనూ చేరుస్తారు.

పోలీసులు ఎదుర్కొనే జీవనశైలి సమస్యల మీద దృష్టిపెట్టే ఆమె కరోనా నేపథ్యంలో మరెన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ‘లాక్‌డౌన్‌ మొదలైనప్పటినుంచీ విరామం లేకుండా పనిచేస్తోంది మా డిపార్టుమెంటు. అందరినీ ఇళ్లలో భద్రంగా ఉంచడం కోసం మేం వీధుల్లో ఉండకతప్పదు. కరోనా వ్యాపించకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీదే ఉండడంతో దానికి బాధితులుగా మారే ప్రమాదమూ వారికే ఎక్కువ. జిల్లా ప్రజలకూ నాలుగు వేలమంది పోలీసు సిబ్బంది బాగోగులకూ నాదే బాధ్యత. సరిహద్దుల్లో చెక్‌పోస్టులన్నీ రోజూ చూసివస్తాను. రోజంతా రోడ్డు మీద ఉండే పోలీసులకు మాస్కులు సరిపోవని ఫేస్‌ షీల్డ్స్‌ అందజేశాను. చెక్‌పోస్టుల దగ్గర క్యూబికల్‌ ఏర్పాటుచేసి ప్రతి పోలీసూ తరచుగా శానిటైజర్‌ షవర్‌ తీసుకునేలా చూస్తున్నాను. నాలాగే వాళ్లూ వాళ్ల కుటుంబసభ్యులను ఇంట్లో వదిలి విధులకు వచ్చారు కాబట్టి వాళ్లు సురక్షితంగా ఇంటికి వెళ్లేలా చూసుకుంటాను...’ అంటారు ఆర్తి.

బెంగపడి తిండి మానేసింది...: సుగంధ, నర్స్‌

సుగంధ, నర్స్‌
సుగంధ, నర్స్‌

అమ్మ ఆఫీసునుంచి వచ్చే వేళకి గుమ్మం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తూ ఉంటారు పిల్లలు. ఆ సమయంలో ఇంట్లో నాన్న ఉంటే స్కూటరు మీద ఎదురెళ్లి అమ్మను ఎక్కించుకురావటం... అదో ఆనందం. ఉత్తర కర్ణాటకలోని బెలగావి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సుగంధకి మూడేళ్ల కూతురు ఉంది. ఆస్పత్రిలో ఆమె డ్యూటీ ముగిసే సమయానికి తండ్రీకూతుళ్లు స్కూటరు మీద వచ్చేవారు. దూరంగా అమ్మను చూడగానే స్కూటరు దిగి పరిగెత్తుకెళ్లి అమ్మ చంకనెక్కేది ఆ చిన్నారి. అలాంటిది కరోనావైరస్‌ చికిత్సలు మొదలయ్యాక సుగంధ కొన్ని రోజులపాటు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. డ్యూటీ పూర్తయిన తర్వాత మరో పదిహేను రోజులు క్వారంటైన్‌లో ఉంది. అన్ని రోజులు అమ్మ కన్పించకపోయేసరికి ఇంట్లో పిల్ల బెంగపెట్టుకుంది.

తిండి తినడం మానేసింది. దాంతో దూరం నుంచీ అయినా తల్లిని చూపిస్తే బెంగతీరుతుందేమోనని ఆ తండ్రి స్కూటరు మీద పాపను సుగంధ క్వారంటైన్‌లో ఉన్న చోటికి తీసుకెళ్లాడు. తల్లిని చూడగానే దగ్గరికి వెళ్తానని పాప ఒకటే ఏడుపు. ఎదురుగా చేతులు చాచి ఏడుస్తూన్న పాపని ఎత్తుకోవడానికి వీల్లేని పరిస్థితికి సుగంధకూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తల్లీకూతుళ్ల బాధ చూస్తూ పాపాయిని గట్టిగా పట్టుకుని నచ్చజెబుతూన్న తండ్రి మరో పక్క.ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్‌ అయింది. ఎందరినో కదిలించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అది చూసి చలించి సుగంధకు స్వయంగా ఫోను చేసి ధైర్యం చెప్పారు. ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ వైద్య సిబ్బంది ఎందరో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనీ, వారి కష్టాన్ని మనం వృథా కానివ్వకూడదనీ అన్నారు.

దేశ అవసరం ముఖ్యమని...: మినాల్‌ భోస్లే

మినాల్‌ భోస్లే
మినాల్‌ భోస్లే

పుణెలోని ఓ ల్యాబ్‌లో వైరాలజిస్టుగా పనిచేస్తున్న మినాల్‌ భోస్లే గర్భిణి. ఏడో నెలలోనే ఆమెకు ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. కొన్నాళ్లు ఆస్పత్రిలో ఉండాల్సివచ్చింది. ఫిబ్రవరిలో ఆమె ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యేసరికి కరోనా సమస్య మొదలైంది. ఆమె స్థానంలో మరొకరెవరైనా ఉంటే ప్రసూతి సెలవు పెట్టేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని సుఖప్రసవం అయ్యేలా చూసుకునేవారు. మినాల్‌ అలా చేయలేదు. వైరాలజిస్టుగా ఇప్పుడే దేశానికి తన అవసరం ఉందనుకుంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తే ప్రజలను పరీక్షించడానికి మనదేశంలో సరైన పరీక్ష కిట్లు లేవు. ఉన్నవి కొన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. వాటిని తయారుచేయగలిగేది తనలాంటి వైరాలజిస్టులే కాబట్టి విశ్రాంతి సంగతి పక్కన పెట్టి మినాల్‌ విధుల్లో చేరింది.

నిండు గర్భిణి, పనిచేసేది వైరాలజీ ల్యాబ్‌లో. ఏ రకంగా చూసినా ప్రమాదకరమే. మినాల్‌ అవేవీ ఆలోచించలేదు. పనిని సవాలుగా తీసుకుంది. పదిమంది సభ్యుల బృందానికి నాయకురాలిగా ఆరువారాల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి మార్చి 18న తాము రూపొందించిన కిట్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ మర్నాడే ఆస్పత్రిలో చేరి పండంటి పాపాయికి తల్లయింది. ఇటు పాపాయి పుట్టడమూ అటు మినాల్‌ రూపొందించిన కిట్‌కి ప్రభుత్వ ఆమోదం లభించడమూ ఒకేసారి జరిగాయి. పని పట్ల మినాల్‌ నిబద్ధతకు ఆనంద్‌ మహీంద్రా, కిరణ్‌ మజుందార్‌ షా లాంటి హేమాహేమీల ప్రశంసలు లభించాయి. అలా మార్చి చివరి వారంలో మేడిన్‌ ఇండియా టెస్టింగ్‌ కిట్‌ అందుబాటులోకి రావటానికి మూలకారణంగా నిలిచింది మినాల్‌ భోస్లే.

ఇవీ చూడండి...

స్వీయ నిర్బంధం.. అమ్మతో బలపడుతున్న బంధం

Last Updated : May 10, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.