Lokesh Open Letter To Jagan : పోలవరం నిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరిపి, వారి సమస్యలు పరిష్కరించి.. దీక్షలు విరమింపజేయాలని తెదేపా నేత నారా లోకేశ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. చట్టప్రకారం అందరికీ పునరావాసం కల్పించటంతోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందరికీ వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో సీఎం ప్రకటించినట్లుగా రూ.10లక్షల ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలన్నారు.
చట్టప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం.. చట్టాల్ని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. 18ఏళ్లు ఉన్న వారందరికీ ప్యాకేజీ వర్తింపచేయాలని కోరారు. నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలూ కల్పించాలని అన్నారు. గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే.. కటాఫ్ తేదీగా పరిగణించాలన్నారు. ఇప్పటికైనా స్పందించి 1500 నిర్వాసిత కుటుంబాల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : SomiReddy On Amaravathi Corporation : భూములు తాకట్టు పెట్టడానికే.. అమరావతి కార్పొరేషన్ : సోమిరెడ్డి