ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన 'చలో తాడేపల్లి' కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించటంపై తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా నిరుద్యోగ యువతని బెదిరించే విధంగా గుంటూరు ఎస్పీ మాట్లాడటం..,కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని చెప్పటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""కొంతమంది పోలీస్ అధికారులు వైకాపా బానిసలుగా బ్రతుకుతున్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చెయ్యాల్సిన వారు రాజారెడ్డి రాజ్యాంగానికి సలామ్ కొడుతున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. దానిని కాలరాసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?. శాశ్వతంగా సీఎం నివాసం వద్ద 144 సెక్షన్ పెట్టడమే తప్పైతే..,నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదంటూ పోలీసులు మరో పెద్ద తప్పు చేస్తున్నారు. వైకాపా కండువా కప్పుకొని జగన్‌కి గులాంగిరి చేస్తున్న అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులను కాపాడటానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందని గుర్తుపెట్టుకోవాలి." -ట్వీటర్లో లోకేశ్
నిరుద్యోగులను కాపాడటానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందని గుర్తుపెట్టుకోవాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 17, 2021
">నిరుద్యోగులను కాపాడటానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందని గుర్తుపెట్టుకోవాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 17, 2021
నిరుద్యోగులను కాపాడటానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందని గుర్తుపెట్టుకోవాలి.(4/4)
— Lokesh Nara (@naralokesh) July 17, 2021