ఫార్మర్ సొసైటీ కింద పేద దళితులకు 45 ఏళ్ల క్రితం ఇచ్చిన భూములపై వైకాపా నేతలు వాలారని నారా లోకేశ్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు పంచాయతీ చట్టేవారిపాలెంలో దళితుల భూములను వైకాపా నాయకుడు ద్వారకానాథ్‌రెడ్డి కబ్జాకు యత్నించి...అడ్డుకున్న దళితుల్ని ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తానని బెదిరించారని లోకేశ్ ఆరోపించారు. ఏం చేస్తారో చేసుకోండని ద్వారకానాథ్‌రెడ్డి హెచ్చరించడం రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాల తీవ్రతకు అద్దం పడుతోందని విమర్శించారు.
ఇదీ చదవండి: తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్