తెదేపా నాయకుడు చింతమనేని ప్రభాకర్ అరెస్టును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. కోవిడ్ నిబంధనలు ఒక్క తెదేపా నాయకులకేనా అని ఆయన నిలదీశారు. చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదని.. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారని లోకేశ్ మండిపడ్డారు. ఆఖరికి కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్ మానసిక స్థితిని చూసి జాలేస్తుందన్నారు. వైకాపా నాయకులు కోవిడియట్స్గా మారారని జాతీయ మీడియా సైతం ఉతికి ఆరేసిందని దుయ్యబట్టారు. గుంపులుగా తిరిగి, ర్యాలీలతో కరోనా వ్యాప్తికి కారణమైన వైకాపా నేతలపై కేసులు ఉండవా అని లోకేశ్ ప్రశ్నించారు.
జగన్ మానసిక స్థితి చూసి జాలేస్తోంది: లోకేశ్ - చింతమనేని ప్రభాకర్ అరెస్టు న్యూస్
కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్ మానసిక స్థితిని చూసి జాలేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కరోనా నిబంధనల పేరుతో ఆ పార్టీ నేత చింతమనేనిని అరెస్టు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.