ETV Bharat / city

'ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చట్టం తీసుకురావాలి' - ఉద్యోగుల సంఘం

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్ సూర్య నారాయణ డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలను బలహీనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, చంద్రశేఖర్ రెడ్డిని నియమించిన తీరు అలాగే కనిపిస్తోందన్నారు. విజిలెన్స్ విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించిన వ్యక్తికే...సలహాదారు బాధ్యతుల కల్పిస్తే ఎలా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్ సూర్య నారాయణ

author img

By

Published : Nov 10, 2021, 6:04 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లించేలా.. వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్​ సూర్య నారాయణ డిమాండ్ చేశారు. విజయవాడలోని కెఎల్ రావు భవన్​లో మాట్లాడిన ఆయన.. ఉద్యోగుల సమస్యలపై సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ 30 ఏళ్లపాటు సీఎంగా ఉండాలని ఉద్యోగులు భావించినా.. తమ సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీఆర్సీ విషయంలో కొన్ని ఉద్యోగ సంఘాలు.. ఉద్యోగులను మభ్య పెడుతున్నాయని అన్నారు. రెండున్నరేళ్ల ప్రభుత్వ పరిపాలన పరిశీలిస్తే..ప్రభుత్వ ఉద్యోగుల ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.

గంపగుత్తగా ఓట్లు వేసి సీఎంగా జగన్​ని గెలిపిస్తే తమ బాధలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. జీపీఎఫ్​ పదవీ విరమణ బెన్​ఫిట్స్​ పెండింగ్‌లో పెడుతున్నారని, అసలు ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి దృష్టి లేదన్నారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలుగానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలను బలహీనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, చంద్రశేఖర్ రెడ్డిని నియమించిన తీరు అలాగే కనిపిస్తోందన్నారు. విజిలెన్స్ విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించిన వ్యక్తికే...సలహాదారు బాధ్యతలు కల్పిస్తే ఎలా అని ప్రశ్నించారు.

ఏపీజీఎల్​(APGL) సంస్థ ఇన్సూరెన్స్​లు కట్టించుకుని డబ్బు చెల్లించడం లేదన్నారు. దీనిపై త్వరలో దిల్లీ వెళ్లి సంస్థపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇది తమ ఆదాయంగా మార్చుకుని ఇతర అవసరాలకు వాడేస్తుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎంయస్ఎఫ్​ ఆర్ధిక శాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూర్య నారాయణ డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

roads in ap: రోడ్ల దుస్థితిపై తెదేపా ఆందోళన.. రహదారిపై గోరంట్ల బైఠాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.