ETV Bharat / city

బదిలీలు చేశారు..నియామకాలేవీ ?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధన అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది లేక చాలాచోట్ల ప్రిన్సిపళ్లు మాత్రమే దిక్కయ్యారు. సిబ్బందిని బదిలీ చేస్తున్న అధికారులు కొత్తవారిని మాత్రం నియమించడం లేదు. దీంతో పిల్లలకు పాఠాలు చెప్పేవారే కరవయ్యారు. విద్యార్థి భవిష్యత్తులో కీలకమైన ఇంటర్‌ చదువు ఎండమావిగా మారుతోంది. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలల సక్రమ నిర్వహణపై యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.

బదిలీలు చేశారు..నియామకాలేవీ
బదిలీలు చేశారు..నియామకాలేవీ
author img

By

Published : Nov 16, 2020, 5:35 AM IST

రాష్ట్రంలో 84 జూనియర్‌ కళాశాలలను మంజూరుచేసిన అధికారులు.. వీటికి బోధన పోస్టులను మంజూరు చేయలేదు. దీంతో ఒప్పంద ప్రాతిపదికన 395 మందిని నియమించారు. మంజూరులేని పోస్టుల్లో పనిచేస్తున్నందున వీరికి వేతనాలివ్వడం కుదరదంటూ ఆర్థిక శాఖ కొర్రీ పెట్టింది. దీంతో కొంతకాలం వీరికి సక్రమంగా వేతనాలందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంజూరు లేని అధ్యాపక పోస్టుల్లో పనిచేస్తున్న 395లో 334 మందిని అనుమతి ఉన్న పోస్టుల్లోకి బదిలీ చేశారు. దీంతో 84 జూనియర్‌ కళాశాలల్లో దాదాపు బోధన పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. ఈ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. సెప్టెంబరు22 నుంచి సందేహాల నివృత్తికి ఇంటర్‌ విద్యార్థులు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈనెల 2నుంచి పూర్తి స్థాయిలో తరగతులను మొదలుపెట్టారు. బోధన సిబ్బంది లేని ఈ కళాశాలల్లో విద్యార్థుల పరిస్థితి అగమ్యంగా మారింది.

  • కృష్ణా జిల్లా పాయకపురంలోని రాధానగర్‌ జూనియర్‌ కళాశాలలో 11 మంది ఒప్పంద అధ్యాపకులు ఉండగా పది మందిని వివిధ కళాశాలలకు బదిలీ చేశారు. ప్రిన్సిపల్‌, ఆర్థికశాస్త్రం లెక్చరర్‌ మాత్రమే మిగిలారు. ఈ కళాశాలలో 221 మంది విద్యార్థులున్నారు. ప్రిన్సిపల్‌ తెలిసిన లెక్చరర్లను అభ్యర్థించి కళాశాలకు తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు.
  • గుంటూరు జిల్లా బాపట్ల, అచ్చంపేట జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపళ్లు మాత్రమే ఉన్నారు. ఒప్పంద అధ్యాపకులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. కొత్తవారిని నియమించలేదు.
  • శ్రీకాకుళం జిల్లా రాజాం, ఎల్‌ఎన్‌పేట, జి.సిగడం, కొయ్యాంలలోనూ ఒప్పంద అధ్యాపకుల బదిలీలతో పాఠాలు చెప్పేవారు లేరు.
  • తూర్పుగోదావరి జిల్లా గంగవరం, పామర్రుల్లోనూ లెక్చరర్లు లేరు. గతంలో ఇక్కడ పనిచేసిన ఒప్పంద అధ్యాపకులను బదిలీ చేసి ఇంతవరకు ఎవరినీ నియమించలేదు.
  • నెల్లూరు జిల్లా టీపీగూడూరు, దామరమడుగు, వెంగమాంబపురం జూనియర్‌ కళాశాలల్లోనూ ప్రిన్సిపళ్లు మాత్రమే మిగిలారు.

అతిథులను నియమించినా..

పోస్టులు మంజూరులేని వాటిల్లో అతిథి లెక్చరర్లను నియమించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక బడ్జెట్‌ లేనందున ఇప్పటికే పలు జూనియర్‌ కళాశాలల్లో బోధిస్తున్న వారికి రెండేళ్లుగా వేతనాలందడం లేదు. కళాశాలలకు విద్యార్థులు చెల్లించే ప్రత్యేక రుసుములను వీరి వేతనాలకు వాడుకోవాలని లోగడ అధికారులు సూచించారు. ఎక్కువమంది అతిథి లెక్చరర్లున్న చోట ఈ డబ్బులు సరిపోవడం లేదు. ఎప్పటికైనా వేతనాలొస్తాయనే ఆశతో చాలా మంది అప్పు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొందరు ప్రభుత్వ కళాశాలతోపాటు ప్రైవేటులోనూ తరగతులు చెప్పి జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు 84 కళాశాలల్లో అతిథి అధ్యాపకులను నియమించినా వేతనాల చెల్లింపు సమస్యగా మారే అవకాశముంది. అయితే సమీప కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను వారానికి మూడు రోజులపాటు సమస్య ఉన్నచోట బోధించాలని సూచించడం గమనార్హం.

ప్రవేశాలు ఎలా?..

ఇంటర్‌ విద్యామండలి ఈ ఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాలను నిర్వహిస్తోంది. లెక్చరర్లు లేని ఈ కళాశాలల్లో ప్రవేశాలు పొందే విద్యార్థుల పరిస్థితేమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండో ఏడాదిలో ఉన్న వారికి సక్రమంగా బోధించకపోతే ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎలా గట్టెక్కుతారన్నది ప్రశ్నార్థకమే.

ఇదీచదవండి

ఫైజర్ నుంచి ఆశాభావ ప్రకటన... త్వరలో కొవిడ్ వ్యాక్సిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.