ETV Bharat / city

'కేంద్ర మార్గదర్శకాలను బట్టి ర్యాలీలపై చర్యలు'

రాష్ట్రంలో చాలా చోట్ల ర్యాలీలు చేస్తున్న ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని వాటిపై మరోమారు పరిశీలించి తదుపరి కార్యాచరణ చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇప్పటికే దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన 955 కేసుల్లో 642 నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు.

ks jawahar
ks jawahar
author img

By

Published : Apr 25, 2020, 2:15 AM IST

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను బట్టి ర్యాలీల నిర్వహణపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ఇప్పటివరకు 54,341 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. 10 లక్షల జనాభాకు 1,018 పరీక్షలు నిర్వహించి దేశంలోనే ముందంజలో ఉన్నాం. జాతీయ సగటు 390. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన 955 కేసుల్లో 642 కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే నమోదయ్యాయి. గురువారం వరకు 103 మండలాల్లో కేసులు వచ్చాయి. శుక్రవారం మరో ఏడింట్లో నమోదయ్యాయి. కేసుల నమోదును అనుసరించి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఇద్దరు ఐఏఎస్​లను కర్నూలు జిల్లాకు పంపించాం' అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

వైద్య సిబ్బందిని కొట్టిన ఆ ఐదుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.