ETV Bharat / city

KRMB LETTER: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ - telangana latest news

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ (krmb letter to telangana and ap) రాసింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు తక్షణమే ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఈఎన్​సీలను (ఇంజినీరింగ్​ ఇన్​ చీఫ్​) కేఆర్​ఎంబీ కోరింది.

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

author img

By

Published : Nov 12, 2021, 8:53 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ (krmb letter to telangana and ap) రాసింది. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలను కోరింది. ప్రాజెక్టులకు సంబంధించి అన్ని వివరాలను అందించాలని లేఖలో(krmb letter to telangana) కోరింది. ఔట్‌లెట్ల నీటి ప్రవాహాలు, గేట్ల నిర్వహణ విధానం, ఫ్లడ్ హైడ్రోగ్రాఫ్, రిజర్వాయర్ రూటింగ్ స్టడీ, 30 ఏళ్ల డిమాండ్ వివరాలను వీలైనంత త్వరగా అందించాలని కేఆర్​ఎంబీ కోరింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వివరాలు తక్షణమే ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఈఎన్​సీలను (ఇంజినీరింగ్​ ఇన్​ చీఫ్​) కేఆర్​ఎంబీ కోరింది.

జీఆర్​ఎంబీ ఉపసంఘం భేటీ..

ఈనెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (Grmb sub committee meeting) భేటీ కానుంది. హైదరాబాద్ జలసౌధలో.. దేవాదుల, తొర్రిగెడ్డ ఎత్తిపోతల, చాగలనాడు ఎత్తిపోతల పంప్ హౌస్‌. కాకతీయ కాల్వ క్రాస్ రెగ్యులేటర్ అంశాలపై చర్చించనుంది.

సాగర్​కు కేఆర్​ఎంబీ ఉపసంఘం..

కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకునేందుకు కృష్ణా బోర్డు (Krishna River Management Board) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెలలో జరిగిన బోర్డు (Krishna River Management Board) సమావేశంలో అప్పగించేందుకు గుర్తించిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కంపోనెంట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో ఉప సంఘం (KRMB Subcommittee) నాగార్జునసాగర్‌కు వెళ్లనుంది. రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలోని కంపోనెంట్లను పరిశీలించి రెండోరోజు మధ్యాహ్నం రెండు రాష్ట్రాల సభ్యులతో ఉప సంఘం (KRMB Subcommittee) సాగర్‌లో సమావేశం నిర్వహించనుంది.

ఈ మేరకు బోర్డు (Krishna River Management Board) ఓప్రకటనను విడుదల చేసింది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లెట్లను పరిశీలించిన ఉప సంఘం... 15వ తేదీన ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పంప్ హౌస్, సాగర్ స్పిల్ వే, స్లూయిస్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించనుంది. 16వ తేదీన సాగర్ ఎడమ కాల్వ పవర్ హౌస్, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్‌లను పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం సాగర్‌లో ఉపసంఘం (KRMB Subcommittee) సమావేశం జరగనుంది.

ఇదీచూడండి:

మూలధన వ్యయ లక్ష్య సాధనలో ఏపీ వెనుకబాటు: కేంద్ర ఆర్థికశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.