ETV Bharat / city

ఏపీ బడ్జెట్​: బ్రాహ్మణ కార్పొరేషన్​కు 200కోట్లు కేటాయింపు

author img

By

Published : Jun 17, 2020, 8:00 PM IST

ఈ సారి బడ్జెట్​లో బ్రాహ్మణ కార్పొరేషన్​కు ముఖ్యమంత్రి జగన్ 200కోట్లు కేటాయించారని ఉభాసభాపతి కోన రఘపతి స్పష్టం చేశారు. జూలై నుంచి రాష్ట్రంలోని 22 వేల పేద బ్రాహ్మణులకు నెలకు 2,500 రూపాయలు చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తామని బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు.

Kona Raghupathi comments on Brhamana Corporation Budget
ఉభాసభాపతి కోన రఘపతి

బ్రాహ్మణ కార్పొరేషన్​కు బడ్జెట్​లో సీఎం జగన్ 200కోట్లు కేటాయించారని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. దేవాదాయ శాఖ బడ్జెట్లోనే ఈ నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. ఈ సారి కార్పేరేషన్​కు నిధులు పెంచాలని సీఎంను కోరగా... ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వల్ల బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్నారని... వారందరికీ సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు.

పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం...

గత ఏడాది బ్రాహ్మణ కార్పొరేషన్​కు 100కోట్లు నిధులు కేటాయించగా. . ఈ ఏడాది రెట్టింపు చేసి 200 కోట్లు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారని... బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. జూలై నుంచి రాష్ట్రంలోని 22 వేల పేద బ్రాహ్మణులకు నెలకు 2,500 రూపాయలు చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి: 'తెదేపా నేతలపై పెట్టేవి అక్రమ కేసులే... ఇదిగో సాక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.