గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో మంత్రుల అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
"కృష్ణా జిల్లా మంత్రులతో వంశీ ప్రతిరోజు తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తారు. విశ్వాసఘాతుకానికి మారుపేరు వల్లభనేని వంశీ. కృష్ణా జిల్లా ఆడపడుచుల్ని కించపరిచేలా మాట్లాడిన వంశీకి ..అమ్మవారి శాపం తగులుతుంది. చంద్రబాబు భిక్షతో గన్నవరం ఎమ్మెల్యే అయ్యాడు. తనపై ఉన్న కేసుల భయంతోనే జగన్ పంచన చేరి, హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్కు పొర్లు దండాలు పెడుతున్నాడు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇప్పించేందుకు మంత్రి కొడాలి నాని 8 శాతం కమీషన్ అడిగాడు. మరో మంత్రి పేర్ని నాని కులాన్ని అడ్డంపెట్టుకుని తిరుగుతూ.. వాళ్లనే తిరిగి తిడుతుంటాడు" -కొల్లు రవీంద్ర, తెదేపా నేత
ఆ రోజులు మరిచిపోయారా ?
చంద్రబాబు, లోకేశ్ దర్శనం కోసం పడిగాపులు కాసిన రోజులు వల్లభనేని వంశీ మరిచినట్లుందని తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సహా పరిటాల కుటుంబాన్ని వంశీ మోసగించాడని ఆయన విమర్శించారు. తన తండ్రి సాధారణ ఉపాధ్యాయుడైతే.. వంశీ వేల కోట్లు ఎలా సంపాదించాడని నిలదీశారు. గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల నిర్మాణం కోసం ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున కాజేశాడని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేని దుస్థితిలో వంశీ ఉన్నాడని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి
Chandrababu Delhi tour: రాష్ట్రంలో పరిణామాలు, అరాచకాల అజెండాగా తెదేపా దిల్లీ పర్యటన