మత్స్యకారుల జీవన విధానాన్ని దెబ్బతీసేలా.. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. చెరువులపై ఆధారపడి లక్షల మంది మత్స్యకారులు జీవిస్తున్నారని, ఈ జీవో వల్ల వారి బతుకులు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో - 217ను రద్దు చేసేవరకూ పోరాటం చేస్తామన్నారు. ఈ నెల19న నెల్లూరులో మత్స్యకార హోరు పేరుతో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
"మత్స్యకారుల జీవన విధానాన్ని ఒక్క జీవోతో నాశనం చేస్తున్నారు. చెరువులు సాగుచేసుకుని లక్షలమంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జీవో నెం.217 ద్వారా మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. జీవో నెం.217 రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుంది." - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి
ఇదీ చదవండి: TDP Protest: జే బ్రాండ్‌తో సీఎం జగన్ జనాల ప్రాణాలు తీస్తున్నారు: తెదేపా